Pages

Sunday, February 20, 2011

కొవ్వొత్తులు

కొవ్వొత్తి తయారు చేయడం చాలా సరదా హాబీ. నేను చేసి అలంకరించినవి    ఇక్కడ   ---->  బొమ్మలు   --->     http://myhobbystudio.blogspot.com

Thursday, January 20, 2011

టైమ్ ట్రావెల్

"ఆ అంతరిక్ష నౌక  ఎంత పెద్దదిగా ఉండాలంటే..... కాంతివేగంతో ప్రణానించడానికి  సరిపడా  ఇంధనం  దానిలో పట్టేంత...."  డిస్కవరీ  చానల్ లో స్టీఫెన్ హాకింగ్ గొంతు( ఆయన ఆలోచనలు..., చదివే అతడి గొంతు) . ..

’ఎన్ని సార్లు చూస్తావురా   అదే అదే  మళ్ళీ మళ్ళీ’  విసుగుతో  నేను పెట్టే మొర  నా సుపుత్రుడు ఆలకించే పరిస్థితిలో  లేడు.     ఏమందీ .....   సృష్టి  మనం ఏదంటే దాన్నే ఆక్సెప్ట్  చేస్తుందా..!  ఇప్పటి  నీ పరిస్తితులన్నింటికీ  కారణం  నీ ఆలోచనలూ పలుకులూ   నువ్వేది అన్నా  తధాస్తు   అంటుందా...!  లూయీస్ రాతలు  చదివీ  జీర్ణం చేసుకునే ప్రయత్నంలో  నా ఆలోచనల్లో నేను!
"ఏయ్ లే టీవీ ముందునుండి లే కాసేపు ఆడుకోపో"  బలవంతంగా  టీవీ కట్టేయకపోతే ఎన్నిరోజులైనా  ఇలాగే కూర్చుంటాడు .   "అమ్మా  ఇంపాసిబుల్ అమ్మా ఇంపాసిబుల్  పాస్ట్ లోకి వెళ్ళలేం..! ప్చ్... పారడాక్స్  ప్చ్.. పారడాక్స్ అమ్మా   ఇప్పుడు  నువ్వు పెట్టెలోంచి గన్ తీస్తూ  వున్నావు  తీసాక  ఒక క్షణం వెనిక్కెళ్ళి  నిన్ను కాల్చేసావు. ఎలా ఇప్పుడు మళ్ళీ బతికే వున్నావు ! చనిపోతే ఐతే అప్పుడు నిన్ను కాల్చిందెవరు?  ఇప్పుడు నువ్వు ఎలా బతికి వున్నావు??"     అదోలా నిట్టూర్స్తూ  బయటకు నడిచాడు వాడు.
ఏవో కొర కొర చూపులు నాకు తగిలినట్టనిపించి  వెనిక్కి తిరిగీ తిరగంగానే  ఈయన  మొదలు పెట్టాడు " చూడు వాడికా సైన్స్ పిక్షన్  చెప్పీ  చెప్పీ  వాడ్ని ఇలా చేసావు."
బాబూ నేను చెప్పిన సైన్సు పిక్షన్ దగ్గరే ఆగిపోయిన పసికూనేం కాదు వాడు నాకే సైన్సు చెపుతున్నాడు రోజూ  అన్నీ డిస్కవరీలో చూసి  వినూ వినూ అని సాగదీసి చెప్పీ చెప్పీ ... అవన్నీ వినీ వినీ నా పరిస్తితి ఎవరికి చెప్పుకోవాలి.  వెంటనే బదులిచ్చిసి. మళ్ళీ నా ఆలోనా స్రవంతిలోకి దూరిపోయాను.   టైమ్ ట్రావెల్ చిన్నప్పుడు  మాకు చాలా చాలా చాలా ఇష్టమైన సబ్జెక్ట్  ఎంతసేపైనా మాట్లాడుకునే వాళ్ళం.  ఇప్పటిలా సైంటిఫిక్ గా కాదుగానీ   టైమ్ ట్రావెల్  చేసి ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలో ఏం ఏం చేసేయాలో  ఎన్నెన్ని కలలు కనేవాళ్ళమో!

అసలు పాస్ట్  :) కి వెళ్ళడం అనేది  అసాధ్యం.....మర్చి పోవాల్సిందేనట... ..    వామ్ హోల్  సృష్టించింనా  రేడియేషన్ ప్రవాహం వల్ల  వెంటనే  డెస్ట్రాయ్ :) అవుతుందట . ఇక పాస్ట్ కి టైమ్ ట్రావెల్ సంగతి మర్చిపోవలసిందే! 

మన జీవిత కాలంలో  వెనిక్కి  ఎలానూ తరచూ ప్రయాణిస్తునే ఉంటాంలే. చాలా మంది తమతో పాటూ పక్కనున్న వాళ్ళను కూడా   తమ పాస్ట్ లోకి  లాక్కుపోతారు  బలవంతంగా :)   అప్పుడేమయిందంటే... ఆ రోజూ  తిరుణాళ్ళలో నేను తప్పిపోయినప్పుడూ ..... ఎంతా మూడేళ్ళే సుమీ నాకు... పచ్చ గౌను వేసుకున్నా నాకింకా గుర్తుందే  అదేమిటో ఏంటో!  ఆ గుడి ఎంత పెద్దదనుకున్నావు దానికి ఎదురుగా పేద్దవీధి  .... ఆ వీధిలో  అటువేపు ఏదీ ఆ పచ్చ మిద్దె వున్న కుడి వైపూ  పేద్ద రంగుల రాట్నం........ అలా  ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తు  పక్కనున్న వాళ్ళనీ లాక్కుపోయి హింసిస్తూ  హాయిగా.. ఉల్లా సంగా  ఉత్సాహంగా  ప్రయాణిస్తారన్న మాట  గతంలోకి. అదీ ఒక విధంగా  టైమ్ ట్రావెలేగా :)
ఇంక ఫ్యూచర్ లోకి అనే దాని మీద మాత్రం కాస్త ఆశపడవచ్చంటాడు   స్టీఫెన్ హాకింగ్.  మాస్ :) ఎక్కువ  ఉన్న దాని దగ్గరలో కాలం చాలా నెమ్మదిగా నడుస్తుంది. బ్లాక్ హోల్  చుట్టూ ప్రయాణించడం ఒకమార్గంట!   అక్కడ ఓ ఐదేళ్ళు ప్రయాణించి  తిరిగి భూమికి వస్తే ఇక్కడ పదేళ్ళ కాలం గడచి పోయి ఉంటుందన్నమాట!   అంటే మనం  ఐదేళ్ళ ముందుకి ప్రయాణిస్తాం అన్నమాట.  చాలా చిన్న ప్రయాణం :) కదా!   దీనికి మంచి మార్గం కాంతివేగంతో ప్రయాణించటం. మనం  కాంతి వేగంతో ఒకవారం ప్రయాణిస్తే  భూమి పైన వందేళ్ళు గడిచి పోతుందన్నమాట.  తిరిగి వచ్చేసరికి వందేళ్ళు ముందుకి వెళ్ళిన ప్రపంచంలోకి అడుగుపెడతాం .  అదన్నమాట :)
ముందుకెళ్ళినా  వెనికెళ్ళినా   మనం కోరినట్టో  సైన్స్ పిక్షన్ కథల్లోలానో  అంత సీన్ లేదు అప్పుడూ మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి పిల్లల్లోలా  టైమ్ ట్రావెల్ మోజూ ఆసక్తీ లేదిప్పుడు మనకి :)
ఇప్పుడైతే  లూయీస్  చెప్పే  ఈ  తధాస్తు సిద్దాతం మాంచి క్యూరియాసిటీ :)  కలిగిస్తోంది  నాకు. ఇంతకీ ఆ లూయీస్ చెప్పిందేంటంటే   నువ్వేదంటే  అదే. నువ్వేది కోరితే అదే, నువ్వేదిస్తే అదే.   అదే జీవితం.   నీ జీవితాన్ని నువ్వే  సృష్టించు కున్నావ్.  ఇప్పుడీ క్షణంలో ఎలా ఉన్నావో  అదే మళ్ళీ జరగబోయేది. అంటుంది!
సరే ఆమె చెప్పినట్టే ఇప్పటి మన  పరిస్థితికి నిన్నటివో మొన్నటివో  మన  ఆలోచనలో  అనుభవాలో ఐవుండొచ్చు ఒప్పుకుందాం. మరి అవి  ఎక్కడి నుండి   వచ్చాయ్?  అంతకు మునుపు నుండేగా... .. మరి అవీ??  ఇప్పుడు నాకు ఒక నెగటీవ్ :) ఫీలింగ్ వల్ల అంతా నెగటీవ్:)  గా జరుగుతుందనుకో... సరే  ఆ ఫీలింగికి కారణం అంతకు ముందు జరిగిన సంఘటనే కారణంగా!  మరి ఆ అంతకు ముందు సంఘటన  ఎలా జరిగింది అదీ నేను చేసుకున్నదే . అంటుందీవిడ. ఐతే దానికి కారణం ఆ ఆలోచనే ఐతే అలా ఎంతదాకా? ఊహ తెలియని రోజుల్లోదాకా అప్పుడు ???  ఆలోచించలేని  రోజుల్లో  అప్పుడు  మనకు జరిగిన వాటికి  కారణం  ఎవరు!  తల్లిదండ్రులా?
అంటే..
ఇప్పుడు ఏం జరిగినా  అది మనం సృష్టించుకున్నది కాదుగా! అంటే ఇప్పుడు మళ్ళీ మన చేతిలో ఏమీ లేదనా!

కాదులే,   ఈక్షణం మారు పాతనంతా వదిలేయ్. వదిలేస్తున్నాని చెప్పు సృష్టి  యెస్ అంటుంది. ఇక ఇప్పటి అనుభవమే ఇప్పటి నీ ఆలోచనే ఇప్పటి నీ పలుకులే   నీ జీవితంలో సంఘటనలుగా మారుతున్నాయ్.. అదీ  ఆవిడ చెప్పేది.

"అమ్మా రా  లియోనార్డో డావిన్సీ  గురించి చెప్దూగాని"  ఇట్లా వెళ్ళి  మళ్ళీ  వచ్చేశాడు మా వాడు  ....
ఈ  లూయీసమ్మ  థియరీ లోకి వెళితే మళ్ళీ ఇప్పట్లో బయటకి రాలేం. మళ్ళి మళ్ళీ రాయాలి ఈ కబురులు :)

Tuesday, January 18, 2011

స్క్రాప్

’దేని మీదా శ్రద్ద లేదా! ఎక్కడా నిలకడ లేదా!  అన్నీ లైట్ తీస్కో అంటే అంటావేం! కీర్తీ పేరూ గొప్పా ఆహా ఓహో వద్దేవద్దా ! ’ ఆత్మా సీతా  ఆపకుండా అరచీ కేకలేసి అలసి సొలసి  చీ పో నీ....! అని ఊరుకుని కొద్ది రోజులు ముసుగేస్తుంది అలిగి!   సరెలే కనీసం శ్రద్ద భయం భక్తీ ఉన్నట్టు  నటించు.  మనసులో ఉన్నదున్నట్టు  మాట్లాడకు  అదరికీ ఇరిటేషన్ బీపీలు పెంచితే నీకేం వస్తుంది పాపం తప్పించి?  బ్రతిమిలాడీ చెబుతుంది ముసుగుతీసి  మళ్ళీ :)   
’సరే లే నేనెంత గౌరవిస్తున్నాను అందరినీ .. .  నువ్వేం  ఫీల్ కాకు నేనెప్పుడన్నా ఎవ్వరినన్నా నొప్పించానా నిజం చెప్పి! ’  నా మాటలు విననట్టు ఊరుకుంటుంది  కాసేపు.   సరె పోనీ అందరి సంగతి పోనీ  నీ సంగతి చూస్కో  అంత చులకనేమిటీ నీకు అన్నింటి మీదా! అంత నిర్లక్ష్యం ఏమిటి అన్నింటి మీదా అందరి మీదా!
చులకనా !  అదీ మరీ పెద్దపదం.. ఈ ఆత్మా సీత మరీనూ!   ఎవరి వేషం వాళ్ళు కడుతున్నారు. డ్రామా చూసి సరే కానీ లే. అనుకుంటా అదీ చులకనంటే ఎలాగ!  చిన్నప్పుడు స్కూల్లో  నీతులు చెప్పే టీచర్ ని గౌరవించలేదా ఏమిటి?
ఆయన  ఆ టీచర్ వేషం తీసాక ఎంత  ఆహా ఓహో... ..నో... తెలిసీ  కనిపించి నప్పుడల్లా  నమస్తే   చెప్పలేదా ఏమిటీ?
పోనీలే  చిట్టా విప్పకు. కాస్త పనికొచ్చే పనులుంటే చూడు.  నీ చిత్తం వచ్చినట్టు వుండద్దు  మొదలెడుతుంది   బోధలు.
చిన్నప్పుడు  ఓ పెద్దాయన  అచ్చు ఇలాగే క్లాసులు పీకేవాడు :)  కానీ తేడా ఏమిటంటే  ఈ ఆత్మా సీత నీ సంగతి చూస్కో అని  నస పెడితే  ఆయన  నీ సంగతి పక్కన పెట్టి  పక్కవాడి  సంగతి చూడూ (సంగతి చూడూ అంటే అంతు చూడూ అని కాదు)  అని.  సొంత లాభం కొంత మానుకో  అంటూ  భలే  ఎమోషన్లో  ఎన్నెన్నో  బోధలు చేసేవాడు.  మాటి మాటికీ దేశ సేవ ముఖ్యం అనేవాడు  అదేదో  మంచంలో బామ్మ  ఐనట్టూ మనసేవ కోసం ఎదురుచూస్తూ ఆ కొండల కావల  వున్నట్టూ.  ఆయన   దృష్టిలో  చుట్టూ వున్నవాళ్ళందరూ స్వార్ధ పరులు  దొంగలూనూ!  వీళ్ళంతా  కట్టకట్టుకుని  కనిపించని ఇంకెవరికో  సేవ చేయాలి!  ఆ పెద్దమనిషికి  పెద్ద శత్రువులు ఎవరంటే  ఇరుగు పొరుగు, భార్య, తల్లీ తండ్రీ, పిల్లలు :)  పక్కింటోడితో కొట్లాట ఎందుకంటే  అమ్మో వాళ్ళ సంగతి నీకు తెలియదు  స్నేహంగా వుంటే  మోటర్ చెడిపోయినా గ్యాసు ఐపోయినా మనింటికే పరిగెత్తుకొచ్చే రకాలు  అనే వాడా  సంఘసంస్కర్త ! పెళ్ళంతో స్నేహం చేస్తే నెత్తినెక్కుతుంది.  తల్లి తో చేస్తే నసపెడుతుంది. తండ్రి  తో పచ్చగడ్డి  భగ్గుమనేంత కయ్యం! పిల్లలు రాక్షసులూ వెదవలు ఒక్కరికీ డబ్బువిలువా తెలియక్కర్లే చనువిస్తే  చెడిపోరూ  ఎంత టార్చర్ పెడితే అంత బాగుపడిపోతారు  అదీ  ఆ సేవామూర్తి  అమూల్యాభిప్రాయాలు, కానీ ఆయన దేశ సేవ గురించి మాత్రం శంక అక్కర్లేదు.  పరమ  దేశ భక్తుడు.  ఇంట్లోకి అడుగుపెట్టగానే  పేద్ద భారత మాత పటం.  వరసగా పో్లీస్టేషన్లో  మాదిరి  గాంధీ  సుభాష్  వైగైరాల  పటాలు. దేశ భక్తి గీతాలు తప్పించి ఇంకేం పాడకూడదని   స్ట్రిక్టు  రూలూ. పిల్లలు బొమ్మ లేసినా  అవి గాంధీ వగైరాల బొమ్మలే వేయాలి సుమండీ  దేశ భక్తీ !  చీ ఇందిరా గాంధీ అంతటి దాన్ని చేద్దామని చూస్తే ఈ వెదవది  పెళ్ళి చేసుకుని పిల్లల ముడ్డి కడిగేట్టుంది. అని పాపం ఆయన కూతుర్ని కాల్చుకు తిని. నేను ఇందిరా గాంధీ కావడానికి నువ్వేవన్నా నెహ్రూవా? అని ఆ పిల్ల చేత అనిపించుకుని.  మనసులో పళ్ళు కొరుకున్ని  జీవితాంతం  దాన్ని సాధించేయాలని కంకణం కట్టేసుకుని  మరీ ఆ పూటకి నిద్రోయాడంట!
చిన్నప్పటి  ఆ పెద్దాయనకి పూర్తి అపోజిట్ గా పెద్దయ్యాక  ఓ గురువుగారు  దొరికారు  ఆయన ఫిలాసఫీ ఏంటంటే   నీ సంగతి నువ్వు ముందు చూస్కో .    నీ తల్లి ఒంటరి తనాన్ని గుర్తించు. నీ పిల్లల అవసరాన్ని  తీర్చు. నీ భార్య ప్రేమరాహిత్యానికి గురవకుండా చూడు .  నిలువెత్తు అభిప్రాయాలతో జీవితాన్ని కాల్చుకుని  నిన్నూ కాల్చిన నీ తండ్రి  అయోమయపు వృద్దాప్యాన్ని  గమనించు.  సేవ చేయి  బదులేదీ ఆశించకుండా సేవ చేయి  నీ కుటుంబానికి  సేవ చేయి. ప్రేమించు  కావలసినంత ప్రేమ  ఆదరణా  చూపించు నీలోని కరుణ నీ కుటుంబం పై కురిపించు.
అబ్బే  ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తే  ఏమొస్తుందీ  బూడిద!  అంటారా?  :)
 ఈ  గురువుగారితో తో అదే చిక్కు. సన్యాసిని అన్నట్టు ఉండేవాడు కానీ పెద్ద స్వార్ధ పరుడూ  రౌడీ.   ఆయన గురించి  మళ్ళీ  ఎప్పుడన్నా గుర్తుకొస్తున్నాయి  ప్రోగ్రాం పెట్టుకుని  ఓ పేద్ద పోస్టు రాసుకుందాం.
”అవును గానీ  ఇదంతా ఏమిటీ! దీనికో లేబులూ  పైనో టైటులూ  తగలెట్టు’    మళ్ళీ ఆత్మాసీత ...
మేథావులైతే  అందంగా  మ్యూసింగ్సో  అని పెట్టుకుంటారు గానీ మనకెందుకోయ్   టైటిల్సూ  లేబుల్సూ :)