Pages

Thursday, January 20, 2011

టైమ్ ట్రావెల్

"ఆ అంతరిక్ష నౌక  ఎంత పెద్దదిగా ఉండాలంటే..... కాంతివేగంతో ప్రణానించడానికి  సరిపడా  ఇంధనం  దానిలో పట్టేంత...."  డిస్కవరీ  చానల్ లో స్టీఫెన్ హాకింగ్ గొంతు( ఆయన ఆలోచనలు..., చదివే అతడి గొంతు) . ..

’ఎన్ని సార్లు చూస్తావురా   అదే అదే  మళ్ళీ మళ్ళీ’  విసుగుతో  నేను పెట్టే మొర  నా సుపుత్రుడు ఆలకించే పరిస్థితిలో  లేడు.     ఏమందీ .....   సృష్టి  మనం ఏదంటే దాన్నే ఆక్సెప్ట్  చేస్తుందా..!  ఇప్పటి  నీ పరిస్తితులన్నింటికీ  కారణం  నీ ఆలోచనలూ పలుకులూ   నువ్వేది అన్నా  తధాస్తు   అంటుందా...!  లూయీస్ రాతలు  చదివీ  జీర్ణం చేసుకునే ప్రయత్నంలో  నా ఆలోచనల్లో నేను!
"ఏయ్ లే టీవీ ముందునుండి లే కాసేపు ఆడుకోపో"  బలవంతంగా  టీవీ కట్టేయకపోతే ఎన్నిరోజులైనా  ఇలాగే కూర్చుంటాడు .   "అమ్మా  ఇంపాసిబుల్ అమ్మా ఇంపాసిబుల్  పాస్ట్ లోకి వెళ్ళలేం..! ప్చ్... పారడాక్స్  ప్చ్.. పారడాక్స్ అమ్మా   ఇప్పుడు  నువ్వు పెట్టెలోంచి గన్ తీస్తూ  వున్నావు  తీసాక  ఒక క్షణం వెనిక్కెళ్ళి  నిన్ను కాల్చేసావు. ఎలా ఇప్పుడు మళ్ళీ బతికే వున్నావు ! చనిపోతే ఐతే అప్పుడు నిన్ను కాల్చిందెవరు?  ఇప్పుడు నువ్వు ఎలా బతికి వున్నావు??"     అదోలా నిట్టూర్స్తూ  బయటకు నడిచాడు వాడు.
ఏవో కొర కొర చూపులు నాకు తగిలినట్టనిపించి  వెనిక్కి తిరిగీ తిరగంగానే  ఈయన  మొదలు పెట్టాడు " చూడు వాడికా సైన్స్ పిక్షన్  చెప్పీ  చెప్పీ  వాడ్ని ఇలా చేసావు."
బాబూ నేను చెప్పిన సైన్సు పిక్షన్ దగ్గరే ఆగిపోయిన పసికూనేం కాదు వాడు నాకే సైన్సు చెపుతున్నాడు రోజూ  అన్నీ డిస్కవరీలో చూసి  వినూ వినూ అని సాగదీసి చెప్పీ చెప్పీ ... అవన్నీ వినీ వినీ నా పరిస్తితి ఎవరికి చెప్పుకోవాలి.  వెంటనే బదులిచ్చిసి. మళ్ళీ నా ఆలోనా స్రవంతిలోకి దూరిపోయాను.   టైమ్ ట్రావెల్ చిన్నప్పుడు  మాకు చాలా చాలా చాలా ఇష్టమైన సబ్జెక్ట్  ఎంతసేపైనా మాట్లాడుకునే వాళ్ళం.  ఇప్పటిలా సైంటిఫిక్ గా కాదుగానీ   టైమ్ ట్రావెల్  చేసి ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలో ఏం ఏం చేసేయాలో  ఎన్నెన్ని కలలు కనేవాళ్ళమో!

అసలు పాస్ట్  :) కి వెళ్ళడం అనేది  అసాధ్యం.....మర్చి పోవాల్సిందేనట... ..    వామ్ హోల్  సృష్టించింనా  రేడియేషన్ ప్రవాహం వల్ల  వెంటనే  డెస్ట్రాయ్ :) అవుతుందట . ఇక పాస్ట్ కి టైమ్ ట్రావెల్ సంగతి మర్చిపోవలసిందే! 

మన జీవిత కాలంలో  వెనిక్కి  ఎలానూ తరచూ ప్రయాణిస్తునే ఉంటాంలే. చాలా మంది తమతో పాటూ పక్కనున్న వాళ్ళను కూడా   తమ పాస్ట్ లోకి  లాక్కుపోతారు  బలవంతంగా :)   అప్పుడేమయిందంటే... ఆ రోజూ  తిరుణాళ్ళలో నేను తప్పిపోయినప్పుడూ ..... ఎంతా మూడేళ్ళే సుమీ నాకు... పచ్చ గౌను వేసుకున్నా నాకింకా గుర్తుందే  అదేమిటో ఏంటో!  ఆ గుడి ఎంత పెద్దదనుకున్నావు దానికి ఎదురుగా పేద్దవీధి  .... ఆ వీధిలో  అటువేపు ఏదీ ఆ పచ్చ మిద్దె వున్న కుడి వైపూ  పేద్ద రంగుల రాట్నం........ అలా  ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తు  పక్కనున్న వాళ్ళనీ లాక్కుపోయి హింసిస్తూ  హాయిగా.. ఉల్లా సంగా  ఉత్సాహంగా  ప్రయాణిస్తారన్న మాట  గతంలోకి. అదీ ఒక విధంగా  టైమ్ ట్రావెలేగా :)
ఇంక ఫ్యూచర్ లోకి అనే దాని మీద మాత్రం కాస్త ఆశపడవచ్చంటాడు   స్టీఫెన్ హాకింగ్.  మాస్ :) ఎక్కువ  ఉన్న దాని దగ్గరలో కాలం చాలా నెమ్మదిగా నడుస్తుంది. బ్లాక్ హోల్  చుట్టూ ప్రయాణించడం ఒకమార్గంట!   అక్కడ ఓ ఐదేళ్ళు ప్రయాణించి  తిరిగి భూమికి వస్తే ఇక్కడ పదేళ్ళ కాలం గడచి పోయి ఉంటుందన్నమాట!   అంటే మనం  ఐదేళ్ళ ముందుకి ప్రయాణిస్తాం అన్నమాట.  చాలా చిన్న ప్రయాణం :) కదా!   దీనికి మంచి మార్గం కాంతివేగంతో ప్రయాణించటం. మనం  కాంతి వేగంతో ఒకవారం ప్రయాణిస్తే  భూమి పైన వందేళ్ళు గడిచి పోతుందన్నమాట.  తిరిగి వచ్చేసరికి వందేళ్ళు ముందుకి వెళ్ళిన ప్రపంచంలోకి అడుగుపెడతాం .  అదన్నమాట :)
ముందుకెళ్ళినా  వెనికెళ్ళినా   మనం కోరినట్టో  సైన్స్ పిక్షన్ కథల్లోలానో  అంత సీన్ లేదు అప్పుడూ మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి పిల్లల్లోలా  టైమ్ ట్రావెల్ మోజూ ఆసక్తీ లేదిప్పుడు మనకి :)
ఇప్పుడైతే  లూయీస్  చెప్పే  ఈ  తధాస్తు సిద్దాతం మాంచి క్యూరియాసిటీ :)  కలిగిస్తోంది  నాకు. ఇంతకీ ఆ లూయీస్ చెప్పిందేంటంటే   నువ్వేదంటే  అదే. నువ్వేది కోరితే అదే, నువ్వేదిస్తే అదే.   అదే జీవితం.   నీ జీవితాన్ని నువ్వే  సృష్టించు కున్నావ్.  ఇప్పుడీ క్షణంలో ఎలా ఉన్నావో  అదే మళ్ళీ జరగబోయేది. అంటుంది!
సరే ఆమె చెప్పినట్టే ఇప్పటి మన  పరిస్థితికి నిన్నటివో మొన్నటివో  మన  ఆలోచనలో  అనుభవాలో ఐవుండొచ్చు ఒప్పుకుందాం. మరి అవి  ఎక్కడి నుండి   వచ్చాయ్?  అంతకు మునుపు నుండేగా... .. మరి అవీ??  ఇప్పుడు నాకు ఒక నెగటీవ్ :) ఫీలింగ్ వల్ల అంతా నెగటీవ్:)  గా జరుగుతుందనుకో... సరే  ఆ ఫీలింగికి కారణం అంతకు ముందు జరిగిన సంఘటనే కారణంగా!  మరి ఆ అంతకు ముందు సంఘటన  ఎలా జరిగింది అదీ నేను చేసుకున్నదే . అంటుందీవిడ. ఐతే దానికి కారణం ఆ ఆలోచనే ఐతే అలా ఎంతదాకా? ఊహ తెలియని రోజుల్లోదాకా అప్పుడు ???  ఆలోచించలేని  రోజుల్లో  అప్పుడు  మనకు జరిగిన వాటికి  కారణం  ఎవరు!  తల్లిదండ్రులా?
అంటే..
ఇప్పుడు ఏం జరిగినా  అది మనం సృష్టించుకున్నది కాదుగా! అంటే ఇప్పుడు మళ్ళీ మన చేతిలో ఏమీ లేదనా!

కాదులే,   ఈక్షణం మారు పాతనంతా వదిలేయ్. వదిలేస్తున్నాని చెప్పు సృష్టి  యెస్ అంటుంది. ఇక ఇప్పటి అనుభవమే ఇప్పటి నీ ఆలోచనే ఇప్పటి నీ పలుకులే   నీ జీవితంలో సంఘటనలుగా మారుతున్నాయ్.. అదీ  ఆవిడ చెప్పేది.

"అమ్మా రా  లియోనార్డో డావిన్సీ  గురించి చెప్దూగాని"  ఇట్లా వెళ్ళి  మళ్ళీ  వచ్చేశాడు మా వాడు  ....
ఈ  లూయీసమ్మ  థియరీ లోకి వెళితే మళ్ళీ ఇప్పట్లో బయటకి రాలేం. మళ్ళి మళ్ళీ రాయాలి ఈ కబురులు :)

1 comment:

  1. nice post ramya gaaru, I too read the Louis book. A wonderful book to develop positive attitude and to get good change in life.
    *Bharani.Hyerabad

    ReplyDelete