అన్నింటికి సెలవు ఇచ్చేసుకున్నాను. రోజు నాది. అచ్చంగా నా ఒక్కదానికే! తీరిగ్గా దొరికానని పలకరించడానికి వర్షం తనకు తొడుగా పొగమంచుని చలిని వెంటబెట్టుకుని మరీ వచ్చేసింది!
ఇంటి చుట్టూ కురిసే వర్షం డోంట్ డిస్ట్రబ్ బోర్డ్ లా నా ఏకాంతానికి కాపలా. చలికాలంలో ఈ తుఫాను వర్షం కాఫీలు, పుస్తకాలు సూపర్ జొడీ.
పుస్తకాల బీరువాలో పసలపుడి కథలు మళ్ళీ ఓ సారి మా పసల పూడికి రాకూడదూ అని ఆహ్వానిస్తూ....
ఎందుకు మళ్ళీ చేయి ఆ పుస్తకం వైపె వెళుతుందంటే.....
ఏమో! ఏదో ప్రత్యేక లోకం లోకి వెళ్ళినట్టుంటుంది నాకు ఆ కథల్లోకి వెళితే. సహజమైన ఏ భెషజాల్లెని ఓ ప్రపంచం అది!
ఏమో! ఏదో ప్రత్యేక లోకం లోకి వెళ్ళినట్టుంటుంది నాకు ఆ కథల్లోకి వెళితే. సహజమైన ఏ భెషజాల్లెని ఓ ప్రపంచం అది!
వంశీ సినిమా సినిమాల్లో ఎలా డిఫరెంటో, దాంట్లోని హీరోయిన్ ఎలా ప్రత్యేకమో, హీరో, మిగతా పాత్రలూ, సెట్టింగులు, ఊరు వాడ,. పాటలు డైలాగులు మిగతా సినిమాల కంటే ఎలా డిఫరెంటైనవో అలాగే వంశీ కథలు కూడా.
ఆయన అన్ని కథల్లో ప్రతి పాత్రకీ ఓ గాధుంటాది. ప్రత్యేక లక్షణాలు అలవాట్లు కళ్ళకు కట్టినట్టు వర్ణింపబడతాయి. పడవ నడిపే వాడైనా, ఊరిపెద్ద ఐనా, కూలైనా, కళాకారుడైనా, మాట్లవాడైనా సోమరిగా ఉన్న జూదరైనా, దొంగైనా, దొరైనా అంతా మనకి తెలిన వాళ్ళే, అంతా మనవాళ్ళేననిపిస్తుంది. ఆ మనుషులు మన మనసుకి దగ్గరగా, వాళ్ళ యవ్వారమంతా ఎంతో సహజంగా!
పాత్రలు మాటాడవు మనసువిప్పి చూపెడతాయి. హీరో గురించిన వర్ణన ఎలాగుంటుందో అంతే సహజంగా విలన్ గురించీ. పాత్రల మధ్యనే యుద్దం. చూడబోతే విలన్ తో ఈయనకేమీ సొంతపేచీ్లు ఉండవు. ముఖ్యంగా పరిసరాలు వాటి వర్ణనా నేను ఆ చోటంతా తిరిసి వచ్చినట్టు ఓ ఫీలింగ్
అన్నీ ప్లెస్సులేనా...! నా కైతే కొన్ని మైనస్సులూ కనిపిస్తాయి. కథ చక్కగా సాగుతుంటూ ఉంటుంది ఆత్రంగా చదువుతూ ఉంటాం. మధ్యలో కొస్తుంది చూడు తిండి గురించిన వర్ణనలు కథ మానాన దాన్ని వదిలేసి ఎంచక్కా తాపీగా వంటల గురించి పేజీలకు పేజీలు . ముఖ్యంగా వార పత్రిక సీరియల్స్ లొ చదువుతున్నప్పుడు ఇది చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను. పత్రికలో ఆ వారానికి వచ్చే బాగం ఉండేదే మూడో నాలుగో పేజీలు అయ్యో కథ ఏవైయ్యిందో అన్న ఆత్రుత చదివే వాళ్ళది. మద్యలో సాగదీసే ఆ వర్ణనలు అదే విసుగు.
ఇంకోటి అనవసరపు రొమాన్స్ . అసలు ఈయన కథల్లో తిండీ, రొమాన్స్ అవసరమైన దానికంటే ఎక్కువే ననిపిస్తుంది.
సరెలే ఇదంతా పక్కన పెట్టి. “మా పసలపూడి” కొద్దాం.
మా పసలపూడి కథలు. పుస్తకం చూడగానే హబ్బో పెద్దది అనిపిస్తుంది. (నేను సీరియల్ గా వస్తున్నప్పుడు గనుక చదివుండకపోయుంటే అబ్బో పెద్దగా ఉంది ఇప్పుడే చదువుతాంలేబ్బా అన్కునుండేదాన్నే) పుస్తకం పెద్దదైనా అందులో కథలు చిన్న చిన్నవే గబ గబా చదివిస్తాయి
అసలిది కథల పుస్తకం మాత్రమేనా బొమ్మల పుస్తకంకూడా. రంగురంగుల బాపు బొమ్మలు పుస్తకానికే అసలు అందం. బాపూ బొమ్మల అబిమానులకు ఇది టూ ఇన్ వన్ అన్నమాట.
అసలే వంశీ కళ్ళకు కట్టినట్టు ఆ కథలోకి తీసుకెళుతూ బొమ్మగీసినట్టు రాస్తారు. దానికి తోడు బాపూ గీసిన బొమ్మలు.. యామ్ యామ్ అన్నమాట.
గోదావరి జిల్లా నేపధ్యంలో పసలపూడిని కేంద్రంగా చేసుకుని సాగే కథలు ఇవి. కథలనుకుంటే కథలు మొత్తం ఏకంగా ఒకే కథ అనుకుంటే అదీనూ! మొత్తం అరవైఏళ్ళ కథ.
ఇప్పటి పెద్ద వయసు వాళ్ళు ఆ కథల్లో తమ గతకాలం చూసుకుంటే, ఈ తరం వాళ్ళకి కథల్లోని సాంప్రదాయక గ్రామీణ జీవితాలు ఆ కాలాన్ని పరిచయం చేస్తున్న చరిత్రలా అనిపిస్తాయి.
కథల్లో ఉన్నదేమిటి అంటే .. మనిషితనం, విలువలు. నిష్కలంకమైన హృదయాలు. అమాయకత్వం, అనుబంధాలు, నమ్మకాలు, బలహీనతలు, విషాదం ఇలా చెపుతూ పోతే మనిషిజీవితంలో ఉన్నదంతా... ముఖ్యంగా మానవ సంబంధాలు.
ఆశ, వ్యగ్యం, హాస్యం, వైరాగ్యం, విషాదం ఒకో రుచి చూపిస్తూ ఒక్కో కథా సాగుతుంది.
మామూలుగా సాదా సీదాగా కనిపించే జీవితంలోంచి ఏదో ప్రత్యేకతని తెచ్చి మనముందుంచుతాయి కొన్ని కథలు. అసలు పట్టించుకోవలసిన అవసరమే లేదనుకునే విషయాన్ని తెచ్చి కథగా మార్చి ఊరించి చెప్పి ఇంతుందా అనిపించేలా విస్మయ పరుస్తాడు కొన్ని సార్లు. ఒకోసారి హాయిగా సాగే కథని విషాదాంతం చేస్తాడు. వర్ణించీ ఊరించీ చివరకలా ఏడిపించి.. నిజంగా ఎదురుగా ఉంటే కొట్టాలన్నంతగా .. కర్కషంగా ముగిస్తాడు. ఆ శాడిజం దేముడి దగ్గర నేర్చుకున్నాడేమో.
మనసున్న మనుషుల్ని, మహానుభావులనీ మన కళ్ళముందు నిలుపుతాడు వాళ్ళకో దడం పెట్టుకుంటాం మనం మనసులోనే. ఇక్కడ మనిషిలొని బలహీనతలనీ అంతే లైట్గా తీసుకుంటాం. ఇంతేగదా జీవితం అనే వైరాగ్యం పొందుతాం మరొకసారి!
సరె.............కథల గురించి మొదలెట్టానంటే ఇంకోరోజు నేను సెలవు పుచ్చుకోవలసిందే....
ఇంతకీ అసలు ఇసయం ఏంటంటేనండి. నాకు నేను పుచ్చుకున్న సెలవు రోజుని ఇంకేం చేయకుండా ఈ వంశీ లాగేసుకున్నాడండీ బాబూ :(
ఆయ్ అదండీ........
మరి శెలవండీ
ఆయన స్టైల్లో చెప్పాలంటే .. దిగడతానండి!
మీరు కూడా వంశీ అభిమానులన్న మాట. చాల బావుంది మీ పోస్ట్. మా పసల పూడి
ReplyDeleteకధలు వారం వారం చదివినప్పుడు ఎంత ఎంజోయ్ చెసానో, బుక్ చదివి కూడ అంతే
ఎంజొయ్ చేశా. బుక్ అంతా ఒకే రోజు చదివెయ్యాలని అనిపించినా,రోజూ ఒక్కటి
మాత్రమే చదువుతూ,చదవాల్సిన కధలు తగ్గిపోతున్నయి అని బాధ పడిపోయే వాడిని :) కధలన్నీ నిజం గానే జరిగినట్టు ,జరుగుతుండగా తను కళ్ళారా చూసినట్టు, మన కళ్ళకి కట్టినట్టు చెప్తున్నట్టు ఉంటై.. :) :). "మా దిగువ గోదారి కధలు " పుస్తకం కోసం వెయిటింగ్ ఇక్కడ..
ఆయ్ అదండీ........మరి శెలవండీ .. చాలా బాగా రాసేరండి తవరు.. :)
వేణు గారు, అవును మనం ఆయన అభిమానులం అన్నమాట :) ఇదిగో ఇక్కడ ఇంకో అభిమాని రాసిన పోస్ట్ మీకోసం http://nemalikannu.blogspot.com/2009/09/blog-post_10.html
ReplyDeleteనిజమే సుమండీ రోజుకో కథ చదువుకుని ఆ రోజంతా దాన్నే నెమరేసుకుని ఇంకో కథ మొదలెడుతూ పుస్తకం త్వరగా పూర్తయి పోతుందేమోనని బెంగపడుతూ. మొదటి సారి అలాగే నేనూనీ
అబ్బా...మళ్ళీ గుర్తు చేసారా ఆ చేపల పులుసుని ? ప్చ్... ఈ జన్మ లో అది తినగలనో లేనోనండి.
ReplyDelete" మద్యలో సాగదీసే ఆ వర్ణనలు అదే విసుగు",
" వర్ణించీ ఊరించీ చివరకలా ఏడిపించి.. నిజంగా ఎదురుగా ఉంటే కొట్టాలన్నంతగా .. కర్కషంగా ముగిస్తాడు. ఆ శాడిజం దేముడి దగ్గర నేర్చుకున్నాడేమో"
సరిగ్గా చెప్పారు. నా చేత మీ పోస్ట్ మళ్లీ చదివించారు...:) :)
అయ్యో పాపం! ప్చ్
ReplyDeleteహ హ బాగుంది రమ్యగారు కొన్ని పుస్తకాలు మొదలెడితే అంతే మన టైం మనకితెలీకుండానే అలా లాఘవంగా లాగేసుకుంటాయ్.
ReplyDeleteవేణు గారు
ReplyDeleteఎందుకు తినలేరండీ. నేరుగా వంశీ ని అడగండి. చిట్టెమ్మ లాంటి వాళ్ళు ఎవరో ఉండే వుంటారు. ఆయన రుచి చూసే ఆ కథ రాసేరేమో.
దొరికితే ఆ కథ చదివి లొట్టలు వేస్తున్న అందరికీ చెప్పడం మర్చిపోకండి :)
మళ్ళీ మళ్ళీ ఇందాక వచ్చి చదివినందుకు టాంకులు టాంకులు అండీ ఆయ్ :)
కొత్తపాళీ గారు... వస్తుందండీ వస్తుంది మీకూ అలాంటి రోజకటి వస్తుంది. ఎవరో వచ్చి మీ రోజూని లాక్కుపోతారు :)
ReplyDeleteవేణూ శ్రీకాంత్ గారూ :)
ReplyDeleteఅలా ఇలా కాదు మొత్తం పుస్తకం చదివాను చాలా రోజుల తరువాత :) ఆ మర్నాడు అనిపించింది ఎన్ని పనులకోసం తీరిక చేసుకున్న రోజు ఇలా అయిందని వెంటనే ఆ రొద పోస్ట్ రాయడం మొదలెడితే ఇదిగో ఆ బాధంతా ఎగిరిపోయింది. నా రోజు పోయిందే పోయిందే అనుకుంటూ ఏదో రాద్దామని కూర్చుంటే అది తిరిగి మళ్ళీ పుస్తకం గోలే అయిపోయింది.